Feb 22,2023 23:43

తవనం చెంచయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

పజాశక్తి- చీరాల : ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి నిస్వార్థ ప్రజా సేవకుడిగా తవనం చెంచయ్య పేరు తెచ్చుకున్నారని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య తెలిపారు. తవనం చెంచయ్య 9వ వర్ధంతి సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చీరాల సిఐటియు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ తవనం చెంచయ్య నిరుపేద కుటుంబంలో జన్మించి వ్యవసాయ కార్మికులు, దళితుల సమస్యలు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై నిరంతరం కృషి చేసినట్లు తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిస్వార్థ ప్రజా సేవకుడిగా ప్రజలకు సేవ చేసారని తెలిపారు. అలాంటి నాయకులు ఈ రోజుల్లో కరువయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేకమంది పేదలకు భూములు పై హక్కులు కల్పించడం కోసం చెంచయ్య భూ పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. దళితుల ఎదుర్కొన్న సామాజిక సమస్యలపై, కుల వివక్ష సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. చెంచయ్య స్ఫూర్తితో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ,సమ సమాజ నిర్మాణం కోసం కషి చేయాలని కోరారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసి ఐక్య పోరాట నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్‌, ఎన్‌.బాబూరావు, చీరాల నాయకులు ఎం. వసంతరావు,పి.కొండయ్య, కె.శరత్‌ బాబు, పి.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్ల : కోరిశపాడు మండలం ప్రాసంగులపాడులోని సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్‌ తవనం చెంచయ్య 9వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ పేదల పక్ష పాతిగా, దళితుల అభివద్ధిని కాంక్షించే వ్యక్తిగా కామ్రేడ్‌ చెంచయ్య నిలిచినట్లు తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసే మచ్చలేని నాయకునిగా, తిరుగులేని నాయకునిగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు నేటి సమాజంలో అరుదుగా కనిపిస్తారని తెలిపారు. చెంచయ్య పార్టీకి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు, మండల కమిటీ సభ్యులు, సిఐటియు బాధ్యులు కెఎ.రాజు, చావా కోటేశ్వరరావు, కంచర్ల సుధాకర్‌ , నందికోలు సుబ్బారావు, కంచర్ల సురేష్‌ పాల్గొన్నారు.
మద్దిపాడు : కామ్రేడ్‌ తవనం చెంచయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఉబ్బా ఆదిలక్షి మాట్లాడుతూఅంటరాని తనానికి వ్యతిరేకంగా చెంచయ్య పోరాటం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భూపోరాటాలు, కూలి పెంపు పోరాటాలు చేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉబ్బా వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు, బొమ్మలనాగేశ్వరావు, కాకుమాను అంజయ్య, జజ్జర ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.