Oct 08,2023 17:47

క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న జడ్పిటిసి, ఖోఖో చైర్మన్

నిష్పక్షపాతంగా క్రీడా పోటీల ఎంపిక జరగాలి
జెడ్పిటిసి పుల్యాల దివ్య,  ఉమ్మడి జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి
ప్రజాశక్తి - పగిడ్యాల

      నిష్పక్షపాతంగా క్రీడా పోటీలను జరిపి ఎంపిక చేయాలని జెడ్పిటిసి పుల్యాల దివ్య,  ఉమ్మడి జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి అన్నారు. ఆదివారం  జిల్లా స్థాయిలో జూనియర్ ఖోఖో పోటీలలో పాల్గొన్న విజయం సాధించిన జిల్లాల్లోని వివిధ పాఠశాల పాఠశాల క్రీడాకారు రాష్ట్రస్థాయిలో పాల్గొనేందుకు పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జడ్పిటిసి పుల్యాల దివ్య, ఉమ్మడి జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక్కొక్క రంగంలో ఒకరికి గురువుల ఉంటారని ఆ గురువు లో వ్యాయామ ఉపాధ్యాయు ల వృత్తి ఎంతో గొప్పదన్నారు. ఎంతోమంది విద్యార్థులు చదువులో రాణించలేకపోయినా వాళ్ళ ప్రతిభను గుర్తించి వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాలో రాణించే విధంగా ప్రోత్సహిస్తారు అని అన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచినప్పుడే స్పోర్ట్స్ కోట కింద‌ ఎన్నో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు.  పగిడ్యాల లో ఒక ఇండోర్ స్టేడియం కావాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని అడగగా ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి అది కొద్ది కాలాన్ని ఇండోర్ స్టేడియాన్ని నిర్మించామన్నారు . క్రీడాకారులు క్రీడాల్లో మంచి ప్రతిభ కనబరిచినప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అభివృద్ధిస్తారని క్రీడాకారులకు సూచించారు. ఓటమిని గెలుపును సమానంగా స్వీకరించినప్పుడే రాణించగలరని క్రీడాకారులకు సూచించారు. కవి రచయిత గుంపుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పగిడ్యాల క్రీడాకారులకు పుట్టినిల్లుని ఇక్కడి నుంచి ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థయిలో అంతర్జాతీయ స్థాయిలో  బంగారు పథకాలు సాధించిన వారు ఉన్నారన్నారు. జడ్పిటిసి పుల్యాల దివ్య,  ఉమ్మడి జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి ఒకప్పటి క్రీడాకారులు కావడం వల్లనే క్రీడాలపై మక్కువతో  ఖోఖో క్రీడా పోటీల ఎంపిక ఇక్కడ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  సర్పంచి పెరుమాళ్ళ శేషన్న, ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు శంకర్, సెక్రటరీ ప్రభాకర్, ఉమ్మడి జిల్లా కోచ్ భూపతి, నంద్యాల జిల్లా శాప్ కోఆర్డినేటర్ రవికుమార్, క్రీడా శ్రీ తోకల పీతాంబ రెడ్డి,  ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.