Jan 04,2023 23:27

జిఒ ప్రతులను దగ్ధం చేస్తున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి తగరపువలస : రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన జిఒ1కి వ్యతిరేకంగా టిడిపి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక జంక్షన్‌లో నిరసన చేపట్టారు.. ముందుగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, పార్టీ మండల అధ్యక్షులు డిఎఎన్‌ రాజు, ి 1,2 వార్డుల అధ్యక్షులు టి సూరిబాబు, బడిగింటి నీలకంఠం, నగర కార్యదర్శి పిట్టా సురేష్‌, వానపల్లి సత్య, తదితరులు మాట్లాడుతూ, రోడ్‌షోలు, ర్యాలీలు నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒను తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాసి త్రినాథకుమార్‌, ఎంవి గురుమూర్తి, కొక్కిరి అప్పన్న, గిడుతూరి శ్రీను పాల్గొన్నారు. అనంతరం జిఒ కాపీలను దగ్ధం చేశారు.