Oct 15,2022 23:54

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ

ప్రజాశక్తి-విఆర్‌.పురం
వరుస వరదల కారణంగా దెబ్బ తిన్న ఇళ్ళకు ప్రభుత్వం నేటీకి నష్టపరిహారం ఇవ్వలేదని, వారి సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని ఆ పార్టీ జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో పంకు సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ వరదల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొని సర్వం కోల్పోయిన బాధితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం కాలయాపన చేయడం దారుణమన్నారు. పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ నిర్వాసితులను ప్రభుత్వ పూర్తిగా విస్మరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పాల్గొన్నారు.
ఇళ్ళ నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం
గోదావరి వరదలతో నష్టపోయిన ఇళ్లకు నష్ట పరిహారాన్ని చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చినబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం విఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామంలోని ఏర్పాటు చేసిన సిపిఎం సమావేశంలో వారు మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం అమలు కాలేదన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌, నాయకులు పంకు సత్తిబాబు, కమ్మచిచ్చు సత్యనారాయణ, పులి ధర్మరాజు, గుండిపూడి లక్ష్మణరావు, నెర్రిబోయిన రాజు, నాళ్లారపు చందర్రావు ఆత్మకూరు కాంతారావు తుమ్మలపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.