
ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఎస్‌ఇజెడ్‌కు భూములు ఇచ్చి ఉపాధి కోల్పోయిన నిర్వాసితులందరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని నిర్వాసిత ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిశారు. ఈ సందర్భంగా రుషిల్ డెక్కర్ ప్లైవుడ్ పరిశ్రమలో ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల సమస్యను మంత్రికి దృష్టికి తీసుకువెళ్లారు. రుషిల్ డెకార్ ప్లే వుడ్ పరిశ్రమలో నిర్యాసితులు, ముఠా కార్మికులకు పాత పద్ధతులో పనులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము మాట్లాడుతూ ఎస్‌ఇజెడ్ పరిశ్రమలకు అతి తక్కువ ధరకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమ యజమానులపై ఉందని తెలిపారు. పరిశ్రమలలో ఉపాధి కల్పించకపోతే భూములు కోల్పోయిన నిర్వాసితుల ఏం తిని బతకాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ద్వారపురెడ్డి బాబ్జి, కొరుప్రోలు చిన్నారావు, సత్యం, ముఠా కార్మికులు నానాజీ సత్తిబాబు సూరిబాబు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు