ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో లింగాపురం సెంటర్ వద్ద దాదాపు రూ.17 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా దర్శనమిస్తుంది. గత ప్రభుత్వంలో నిర్మాణం మొదలు పెట్టిన ఈ కాంప్లెక్స్‌కు లింగాపురం పంచాయతీ నిధుల నుండి ఐదు లక్షల ఖర్చు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో సుమారు 12 లక్షల వరకు ఖర్చు చేసి 15 షాపులు నిర్మాణం చేపట్టారు. గడిచిన రెండు సంవత్సరాలుగా షాపింగ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉండటం విశేషం. షాపింగ్ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తే పంచాయతీకి ఆదాయంతో పాటు కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి లభించేదని ఆయా ప్రాంతాల వాసులు తెలిపారు.
ఇదిలా ఉండగా నేటికీ నిర్మాణదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రారంభించడంలో జాప్యం జరుగుతుందని తెలిసింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి షాపింగ్ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు.










