ప్రజాశక్తి - చిప్పగిరి
గ్రామాల్లో నివసించే నిరుపేదలకు 'జగనన్న ఆరోగ్య సురక్ష' ఓ వరం లాంటిదని సర్పంచి లక్ష్మీదేవమ్మ, తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ వైద్యాధికారి జమీల్ అహ్మద్ తెలిపారు. గురువారం దౌల్తాపురం గ్రామంలో సర్పంచి లక్ష్మీదేవమ్మ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు సుధీర్, సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. కర్నూలు నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు సుప్రవల్లిక, మురళీ మోహన్, సౌరబ్, శేఖర్, జమీల్ అహ్మద్ 330 మంది మహిళలకు, పురుషులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను అందజేశారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ప్రసూన ఆధ్వర్యంలో న్యూట్రిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. సర్పంచి మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమం ప్రతి మూడు నెలలకోసారి నిర్వహిస్తే నిరుపేదలు సంతోషిస్తారని అధికారులను కోరారు. ఎంపిడిఒ కొండయ్య, సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు, వైసిపి నాయకులు పెద్ద షేకన్న, దామోదర, చిన్న షేకన్న, తిమ్మప్ప, డిజిటల్ అసిస్టెంట్ శ్రీకాంత్, మహిళ సంరక్షకులు గౌరీ పాల్గొన్నారు.
కంటి పరీక్షలు చేయించుకుంటున్న వృద్ధులు










