ఆగిరిపల్లి:ఆహ్లాదకర వాతావరణంలో తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద పిల్లలకు ఉచితంగా విద్య, వైద్య, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.చెల్లప్ప అన్నారు. మంగళవారం ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలోని హీల్ ప్యారడైజ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హీల్ ఛైర్మన్ ధనప్రకాశ్ మాట్లాడుతూ వేగే శ్రీనివాసరావు వారి ఆర్థిక సహాయంతో హీల్‌లో అలేఖ్య హీల్ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్ఫ్‌్‌లెన్సీ ప్రారంభించామన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ కోర్స్‌లో అడ్మిషన్స్ జరుగుచున్నవని, ఈ కోర్సులో అవకాశం పొందడానికి అనాథ పిల్లలు, తల్లి లేదా తండ్రి లేని పిల్లలు, ఆర్థికంగా వెనకబడిన కుటంబాలకు చెందిన పిల్లలు కనీసం ఇంటర్‌మీడియట్(ఎంపిసి/ఎంఇసి), డిగ్రీ(కంప్యూటర్స్), ఇంజనీరింగ్(కంప్యూటర్స్)లో 70-75 శాతంతో ఉత్తీర్ణులై వుండాలన్నారు. వివరాలకు 9100024435, 9100024438 నెంబర్లను సప్రదించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిఇఒ కె.అజరుకుమార్, కార్యదర్శి టి.లక్ష్మీ, ఐటి హెడ్ కరుణ బాబులు పాల్గొన్నారు.










