Aug 20,2023 23:48

ప్రజాశక్తి - అద్దంకి: పట్టణంలోని ఆటోనగర్‌ సమీపంలో నివాసముంటున్న కొండా నాగార్జున, అంకమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరూ పిల్లలు అంగవైకల్యంతో జన్మించారు. అంగవైకల్యం కలిగిన ఇద్దరి లో ఒక బాబు ఇటీవల మరణించాడు. ఇప్పుడున్న ఇద్దరు పిల్లలో ఒకరు జన్మతరహా అంగవైకల్యంతో ఉన్నాడు. భర్త నాగార్జున అనారోగ్యంతో మంచంపట్టాడు. కుటుంబానికి భార్య అంకమ్మ పెద్దదిక్కు అయింది. కుటుంబాన్ని పోషించటంలో అంకమ్మ సంపాదన చాలీచాలనట్లు జీవనం కొనసాగిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్‌ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సహచరులతో చర్చించారు. దాతలు ముందుకు వచ్చి కుటుంబానికి అవసర మైన బియ్యం, నిత్యవసర సరు కులను, కొంత నగదును సమకూర్చి ఆ కుటుం బానికి అందించారు. జ్యోతి రమేష్‌ బాబు మాట్లాడుతూ నాగార్జున ఆధార్‌, రేషన్‌ కార్డు అన్నీ గత 7 సంవత్సరాల నుండి అద్దంకిలోనే ఉన్నాయని అన్నారు. వారికీ సొంత ఇల్లు కూడా లేదని అన్నారు. కనుక అధికారులు వెంటనే జగనన్న కాలనీలో స్థలం కేటాయించి ఇల్లు కట్టించాలని కోరారు. అలాగే ధాత్రుత్వం గల పెద్దలు తమవంతు సాయన్ని అందించాలని కోరారు. ఆ కుటుంబాన్ని భవిష్యత్లో తమ వంతు ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, 30వ వార్డ్‌ కౌన్సిలర్‌ గుంజి కోటేశ్వరరావు, ఐక్యవేదిక ట్రెజరర్‌ చెన్నుపల్లి నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు అంకం నాగరాజు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు బుజ్జి కొమ్మాలపాటి, సభ్యులు జ్యోతి డేవిడ్‌, మంచు హనుమం తరావు, కష్ణ, బండారు చంటిబాబు, కుమారి, మంగమ్మ పాల్గొన్నారు.