నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి జగనన్న
ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవి రెడ్డి అన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు గ్రామంలో ప్రహ్లాద రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం129 వ రోజు నిర్వహించారు ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గోస్పాడు గ్రామంలో 129వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాల నియోజకవర్గం లో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో సంక్షేమం అభివృద్ధి పెద్ద పీట వేస్తున్నామని గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు మరియు నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటు చేయడంతో రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడే పంటను అమ్ముకునే వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సౌకర్యం కల్పించడం ఎంతో సంతోషకరమని గతంలో రైతు పంటను అమ్ముకోవాలంటే చాలా కష్టపడేవారని వారి కష్టాలను పట్టించుకోకుండా చంద్రబాబు వారి నాయకులు జోభులు నింపారన్నారు వైయస్సార్ ప్రభుత్వంలో రైతులకే కాకుండా మహిళలకు విద్యార్థులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది పేదవారికి అండగా నిలిచి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి పి మధుసూదన్ రెడ్డి, వైసిపి నాయకులు ప్రహ్లాద రెడ్డి, గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, అశోక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి.శ్రీనివాసరెడ్డి , వివేకానంద రెడ్డి, వైస్ సర్పంచ్ రాజు ,వెంకటేశ్వర రెడ్డి ,మౌలాలి, సుభాష్, మరియు ప్రభుత్వ అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు










