ప్రజాశక్తి- కూనవరం
జిల్లా, రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రతిభ కనబరచిన మండలంలోని ముల్లూరు గ్రామానికి చెందిన శీలం రమేష్‌కు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధులు రూ.3 వేలు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా జరిగిన ఆటల పోటీల ముగింపు కార్యక్రమంలో నిరుపేద గిరిజన కుటుంబానికి రమేష్‌ను శాలువాతో సత్కరించి, ఆర్థిక సాయం అందజేశారు. అలాగే కరోనా కాలంలో చనిపోయిన మేకల అఖిల్ జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు రూ.10వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఐక్యతకు తోడ్పడతాయని తెలిపారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదన్నారు. రమేష్ వంటి ప్రతిభవంతులైన నిరుపేద యువకులకు ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బరపాటి ప్రకాష్‌రావు, సోమక సత్యనారాయణ, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు తాళ్లసాయి, గంపల రాజు, బర్ల రాజు, మేకల విజరు, చిందిరం సాయి, శీలం రత్తయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.










