Nov 11,2023 20:28

ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న తెలుగు యువత నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం కోట :  నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్‌ దగా చేశారని తెలుగుయువత పార్లమెంట్‌ అధ్యక్షులు వేమలి చైతన్య బాబు అన్నారు. శనివారం కోట జంక్షన్లో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చైతన్యబాబు మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రలో అధికారంలోకి రాగానే ఖాళీపోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నేటికీ నాలుగున్నరేళ్లయినా అతీగతీ లేదన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గొలగాని సురేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిల ప్రవీణ్‌, నియోజకవర్గాల అధ్యక్షులు గంటా రవి, పెద్దిరెడ్ల సతీష్‌,నగర అధ్యక్షులు మాతా బుజ్జి, చిప్పాడ స్వామి, పాలూరి రాజు నాయుడు, కర్రోతు రాజు, తదితరులు పాల్గొన్నారు.