Sep 17,2023 23:18

జాబ్‌ మేళా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ తదితరులు

పల్నాడు జిల్లా: డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ స్కీల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారి అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధ్ది సంస్ద నిర్వహిస్తున్న కార్యక్రమాలపై, డిస్ట్రిక్ట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కమిటి 2023-2024 నిర్వహించనున్న కార్యక్రమాలపై కలెక్టర్‌ లోతేటి శివ శంకర్‌ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న నిరుద్యోగ యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు జాబ్‌ మేళ, స్కిల్‌ హబ్‌ ట్రైనింగ్స్‌, స్కిల్‌ కాలేజీ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌, డిగ్రీ మరియు ఇంజనీరింగ్‌ కాలేజీలలో నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలపై కలెక్టర్‌ అధికారులతో మాట్లా డారు. నిరుద్యోగ యువతీయువకులకు మరిన్ని మెరుగైన శిక్షణ కార్యక్రమాలను, వారికి కావలసిన, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులపై శిక్షణ కార్య క్రమాలను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను ఆద ేశించారు. ఈ నెల 23న కోటప్పకొండ రోడ్డులోని నరస రావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జాబ్‌ మేళాకు సంబంధించి సంస్థ ప్రచురించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్ప శ్రీ, డిఆర్డిఎ పిడి బి.బాలు నాయక్‌, పల్నాడు జిల్లా నైపు ణ్యాభివృద్ధి అధికారి కె. సంజీవరావు పాల్గొన్నారు.
విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నరసరావుపేట కలెక్టర్‌ కార్యా లయంలోని స్పందన హాలులో విశ్వకర్మ జయంతి ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌,ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాణాల ప్రకారం ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, విశ్వకర్మను ఆహార ప్రదాతగా పేర్కొన్నారని అన్నారు.