Sep 09,2023 21:15

.పీలేరు : నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

రాయచోటి టౌన్‌ : టిడిపి అధ్యక్షులు చంద్రబాబును అరెస్టు చేయడంపై నిరసనాగ్రహం పెల్లుబికింది. నంద్యాల జిల్లా కేంద్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మండలాల నుంచి నియోజకవర్గాలు, జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు, బైక్‌ ర్యాలీలు చేపట్టాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులైన నిరసనలు, ధర్నాలు, బైక్‌ర్యాలీలు, రాస్తారోకోలపై నిర్భందాన్ని ప్రయోగించడం విస్మయాన్ని కలిగించింది. జిల్లాల్లో టిడిపి శ్రేణులు పెద్దఎత్తున చేపట్టిన నిరసనలు చేపట్టడంతో ఉదయం కొంతసేపు నెల కొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌టిసి అధికారులు రాకపోకలను నిలిపేశారు. ముందుజాగ్రత్తల్లో భాగంగా ఆర్‌టిసి బస్సుల రాకపోకలను నిలిపేసింది. ఊహించని రాజకీయ పరిణామాలతో ఆర్‌టిసి రాకపోకల నిలిపేయడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం గమనార్హం. తర్వాత యధాతధంగా బస్సు సర్వీసులు నడిచాయి.
నాయకులు అరెస్టు : నిరసన చేయడానికియత్నించిన టిడిపి ఇన్‌ఛార్జి రమేష్‌ కుమార్‌రెడ్డి, గాజుల ఖాదర్‌బాషాను పోలీసులు అరెస్టు చేసిన సుండుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గాలివీడు రోడ్డు వద్ద నిరసన చేస్తున్న టిటిడి మాజీ బోర్డు మెంబర్‌ ప్రసాద్‌ బాబును ఆరెస్టు చేసి స్థానిక అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పట్టణంలోని కడప-చిత్తూరు రహదారిలో నిరసన చేస్తున్న టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోదరుడు లక్ష్మి ప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు అడ్డుకొని మండిపల్లి భవన్‌కు తరలించి గహ నిర్భంధం చేశారు. టిడిపి రాష్ట్ర పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్‌ గురిగింజ కుంట శివప్రసాద్‌ నాయుడుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె అర్బన్‌: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టమోటా మార్కెట్‌ యార్డ్‌ ఎదురుగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ తనయులు చాణక్యతేజ, యశస్విరాజ్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అరుణ్‌ తేజ్‌, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా తనయుడు జునైద్‌ అక్బరీ కార్యకర్తలతో కలసి నిరసన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాజంపేట అర్బన్‌ : టిడిపి సీనియర్‌ నాయకులు చమర్తి జగన్‌ మోహన్‌రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, అభిమానులు బైపాస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకొని నల్ల బ్యాడ్జీలు ధరించి కడప-తిరుపతి జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని జగన్మోహన్‌రాజు, కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కొమర వెంకటనరసయ్య, మాజీ మహిళా అధ్యక్షులు పత్తిపాటి కుసుమకుమారితో పాటు ఆందోళనకారులను అడ్డుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కలకడ : మండల కేంద్రమైన కలకడ పోలీస్టేషన్‌లో ఎస్‌ఐ తిప్పేస్వామి ముందస్తు జాగ్రత్తగా టిడిపి నాయకులను హౌస్‌ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మండల టిడిపినాయకులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, జిలానీబాషా, ఆవులప్ప, శ్రీనివాసులునాయుడు, వెంకటరమణ పెద్దోడు నవాబుపేట సర్పంచ్‌ గుర్రం శివలను అరెస్టు చేశారు. సుండుపల్లి : మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలతో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకొని కార్యాలయానికే పరిమితం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రెడ్డప్ప, శివకుమార్‌ నాయుడు, ఆనంద్‌ నాయక్‌, దామోదర్‌ నాయుడు, సురేష్‌ నాయుడు, చంద్రమౌళి, వెంకటరమణ, అమర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. కలికిరి: మండల టిడిపి అధ్యక్షుడు నిజాముద్దీన్‌ ఆధ్వర్యంలో కలికిరిలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేసి సిఐడి చర్యలను తీవ్రంగా ఖండించారు. సుండుపల్లి : రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం సుండుపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఆయనను నిర్బంధించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి లండన్‌లో ఉంటూ చంద్రబాబు నాయుడును అరెస్టు చేసేందుకు కుట్రపన్నారని విమర్శించారు.చట్టాలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. చిట్వేలి: టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చిట్వేలిలో టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొత్తబస్టాండ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ బత్యాల అరెస్టును తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు భారీగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్దకు మోహరించారు. బిసిఆర్‌ ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాకర్ల సుబ్బరాయుడు, కాకర్ల నాగార్జున, బొప్పాయి గుండయ్య, నరసింహనాయుడు, బాలు రెడ్డయ్య, సత్యనారాయణ, గుత్తి నరసింహ, నాగార్జున, రామాంజులనాయుడు, శివ, చంద్రమోహన్‌ నాయుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందలూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి నాయకులు పట్టణంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించి సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య, మండల క్లస్టర్‌ ఇంచార్జ్‌ పసుపులేటి ప్రవీణ్‌ కుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు వేణుగోపాల్‌, టిడిపి నాయకులు చుక్కా యానాది, పాటూరు రమేష్‌, జ్యోతి శివ, తాటి సుబ్బరాయుడు, తోట శివశంకర్‌, నారపు శెట్టి వేణు, చామంచి పెంచలయ్య, కానకుర్తి వెంకటయ్య, గౌస్‌ బేగ్‌, బీమా మునుస్వామి, బొమ్మిశెట్టి శంకర్‌, గుండు సురేష్‌, పాల్గొన్నారు