Oct 30,2023 23:03

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నిర్ణీత కాల వ్వవధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో సోమవారం జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌, డిఆర్‌ఒ జి.నరశింహులుతో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 154 మంది తమ తమ సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నమ్మకాన్ని కలిగేలా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనలో వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని అన్నారు. జిల్లా అధికారులందరూ ప్రజల నుంచి వచ్చే అర్జీలు పట్ల అత్యంత శ్రద్ధ వహించి పూర్తిగా చదివి తదుపరి వాటిని పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వి.స్వామినాయుడు, యం.భానుప్రకాష్‌ రెడ్డి, పి. సువర్ణ, డాక్టర్‌ కె.వేంకటేశ్వరరావు, డాక్టర్‌ ఎమ్‌.సనత్‌ కుమారి, సిపిఒ ఎస్‌. మాధవరావు, ఎస్‌జిటి.సత్యగోవిందం, పి.జగదాంబ, కె. విజయ కుమారి, ఎస్‌.అబ్రహం, పి. వీణాదేవి, వి.నాగార్జున రెడ్డి, ఎబివి.ప్రసాద్‌, డి.బాల శంకరరావు, వి.శాంతమణి, తదితరులు పాల్గొన్నారు.