మంగళగిరి: మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిర్ణీత గడువు లోగా సర్వేలు చేపట్టి ప్రజా మన్ననలను పొం దాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి ఆయన గురువారం కార్పొరేషన్ పరిధిలోని సచివాలయాల సర్వేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ప్రజలు వారి స్థలాలు, పొలాల సర్వేకు సంబంధించి ఇబ్బం దులు పడుతున్నారని, కొందరు దరఖాస్తుదారులు స్పందన కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు చేశారని గుర్తుచేశారు. మంగళగిరి మండల, అర్బన్ సర్వేయర్ పోస్టులు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆయా పోస్టులు భర్తీ చేయాలని కమిషనర్ ల్యాండ్ సర్వేయర్స్ సిద్దార్థ జైన్ ను ఇటీవల కోరారని, దీనిపై స్పందించిన ఆయన మంగళగిరి రూరల్ సర్వేయర్ పోస్టును భర్తీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే జరుగుతున్న నేపథ్యంలో ల్యాండ్ సర్వే యర్ల కొరత ఉందని, దీంతో, ప్రస్తుత మండల సర్వేయరే కార్పొరేషన్ ఇన్‌ఛార్జి సర్వేయర్‌గా కొనసాగనున్నారని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో మాట్లాడటం జరిగిందని, ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఆర్డర్ రానుందని అన్నారు. కార్పొరేషన్ పరి ధిలో పెండింగ్‌లో ఉన్న సుమారు 200 సర్వే దరఖాస్తులను వచ్చే నెల 5వ తేదీ నాటికి పరిష్కరించాలని, ఇకపై సర్వే కోసం నూతనంగా వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. సర్వే విషయంలో పారదర్శ కంగా వ్యవహరించాలని, ఎవరైనా దరఖాస్తుదారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మనుషుల మని చెప్పినా నియమ నిబం ధనల మేరకే సర్వే చేపట్టాలని ఆదేశించారు. సర్వే కోసం దరఖాస్తుదారుల వద్ద నుంచి ఎటువంటి లంచాలు ఆశించ కుండా బాధ్యతగా సర్వే చేపట్టి ప్రజా మన్ననలను పొందా లని సూచించారు. సమా వేశంలో మంగళగిరి- తాడే పల్లి తహశీల్దార్లు జీవీ రామ్ ప్రసాద్, నాగిరెడ్డి, ఏసీపీ వెంక టేశ్వర్లు, మండల సర్వేయర్ హనుమంతరావు పాల్గొన్నారు.










