Jun 28,2023 21:00

సమావేశంలో మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : ప్రభుత్వ ప్రాధాన్యతా పనులకు ఇసుకను నిరంతరాయంగా సరఫరా చేసేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో అధికారులకు సూచించారు. బుధవారం మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలో ఇసుక లభ్యతా సరఫరా గురించి జాయింట్‌ కలెక్టర్‌ అధికారులతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించి ఎప్పటికప్పుడు వచ్చిన ఇండెంట్ల ప్రకారం ఇసుక సరఫరా చేయాలని, సమీపంలోని ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా అయ్యేటట్లు చూడాలని ఆదేశించారు. కొత్తగా గుర్తించిన పలు ఇసుక రీచ్‌లు, జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌ల స్థితిగతులు, క్లియరెన్స్‌ గడువు ముగిసిన ఇసుక రీచ్‌లు మొదలైన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మైన్స్‌ అధికారి రవి ప్రసాద్‌, ఆర్‌ డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ ప్రసన్న కుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఇ కృష్ణమూర్తి, డిపిఒ ధనలక్ష్మి, గ్రౌండ్‌ వాటర్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు.