రాయచోటి టౌన్ : అనుక్షణం పర్యవేక్షణ, నాణ్యతతో కూడిన విద్యుత్తు సరఫరాను పట్టణ ప్రజలకు నిరంతరం అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఎన్‌జిఒ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం డిఇతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ పట్టణమంతా గహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించాలనే ఈ ఏడాది సుమారు 60 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయించామని చెప్పారు. పట్టణంలో లోఓల్టేజీ సమస్య దాదాపు పూర్తిగా తగ్గి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అవుతోందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాపై ప్రతి నిత్యం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. పట్టణంలోని వెస్ట్ ఏరియాలో రూ.కోటి వ్యయంతో మాసాపేట సబ్ స్టేషన్‌లో 8ఎంవిఎ అడిషనల్ పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ ఫయా జుర్ రెహమాన్, ఎపి ఎస్‌పిడిసిఎల్ ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఇలు నాగరాజు, నాగేశ్వరరావు, స్థానిక నాయకులు, జయరామిరెడ్డి, మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.










