ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: నిర్మాణ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం నగరంలోని రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద్ కార్యాలయంలో కలసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా నిర్మాణ రంగ సమస్యలను పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి హామి ఇచ్చినట్లు బిల్డర్స్ అసోసియేషణ్ సభ్యులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో క్రెడారు ఎపి వైస్ ప్రెసిడెంట్ రమణరావు, బిఎఐ వైస్ ఛైర్మన్ అత్తలూరి నాగమల్లేశ్వరరావు, నరెడ్‌కో నుండి ఎస్.పి. విజరుకుమార్, హరి ప్రాసద్ రెడ్డి, బిఎస్‌కె పట్నాయక్ ఉన్నారు.










