పనులు పరిశీలిస్తున్న జడ్‌పిటిసి కిట్టు
ప్రజాశక్తి- దేవనకొండ
దేవనకొండలో రూ.40 లక్షలతో సిసి రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టుతున్నట్లు, పనుల్లో నాణ్యతను పాటించాలని జడ్‌పిటిసి కిట్టు సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. శనివారం దేవనకొండ చాకలి వీధికి వెళ్లే రహదారి వెంట నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు సంక్షేమంతో పాటు మరోవైపు అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టుతున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కొత్తపేట రహదారి కూడా పనులు ప్రారంభించినట్లు చెప్పారు.










