Aug 31,2023 00:35
చలమయ్య, విమలకు వినతిపత్రాలు ఇస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి: భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిములను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలపై మంత్రి అంబటి రాంబాబుకు శుక్రవారం సామూహిక రాయబారం ఉంటుందని, తమ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ మేరకు బుధవారం సిపిఎం నాయకులను ఆ పార్టీ కార్యాలయం కలిశారు. వినతిపత్రాన్ని ఇచ్చి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వివరించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య, పట్టణ కార్యదర్శి డి.విమల మాట్లాడుతూ భావన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును విధులను వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దారి మళ్లించడం సరికాదన్నారు. కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికుల పోరాటాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు ఎ.వీరబ్రహ్మం, పి.మహేష్‌, పి.సూర్య ప్రకాశరావు, సాల్మన్‌రాజు, సైదులు, కొండలు పాల్గొన్నారు.