ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు రక్షణకు పోరాటాలకు సిద్ధం కావాలని భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎన్.మోహనరావు పిలుపు నిచ్చారు. మండలంలోని బెండి కొండ తోటలో భూపతి అధ్యక్షతన ఆదివారం భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను అమలు కోసం ఏర్పటు చేసిన బోర్డులోని నిధులను పక్కదారి పట్టించిన ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్దం కావాలన్నారు. నిర్మాణ కార్మికులు ప్రమాదంలో, సాధారణంగా మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.2 రెండు నుంచి రూ.ఐదు లక్షలు పరిహారం, పిల్లల చదువులకు స్కాలర్‌సిప్‌లు, ఆడపిల్ల పెళ్లెళ్లకు ఆర్థిసాయం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉండేవన్నారు. ప్రభుత్వం ఆ నిధులను దారిమళ్లించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కార్మిక సంఘం నిధులు కార్మికులకు దక్కాలంటే పోరానికి సిద్ధ పడాలన్నారు. సిఐటియు జిల్లా నాయకులు ఎన్.గణపతి, పూర్వ సిఐటియు నాయకులు బి.ఆనందరావులు మాట్లాడుతూ మండలంలోని భవన నిర్మాణ కార్మికులను కలుపుకొని ముందుకు సాగడం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన సిద్దం అవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో దువ్వాడ సోమయ్య, గోవిందరావు, టివాసు, రామారావు, ఎస్.మల్లేసు, రామకృష్ణ పాల్గొన్నారు.










