Apr 25,2023 19:29

రికార్డులను పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సచివాలయ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలో 5, 6 వార్డుల సచివాలయాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా సచివాలయంలో స్పందన నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా, సమయపాలన పాటించని ఏడుగురు సచివాలయ ఉద్యోగులకు చార్జీ మెమోలు జారీ చేశామని చెప్పారు. 5వ సచివాలయంలో ముగ్గురు, 6వ వార్డు సచివాలయంలో నలుగురు సెక్రటరీలకు శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోరాదు సంజాయిషీ ఇవ్వాలని నోటీసు జారీ చేశామన్నారు. రోజువారీగా సర్వీసులు పెంచాలని, ఆస్తి పన్ను, తాగునీటి పన్ను వసూళ్లలో పురోగతి సాధించాలని సూచించామని తెలిపారు. రోజువారీగా సచివాలయాలను తనిఖీ చేస్తామని, తాము వెళ్లినప్పుడు గైర్హారయితే చర్యలు తప్పవని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు.