Sep 09,2023 21:18

నిర్లక్ష్యం

 జిల్లా ప్రజాప్రతినిధుల్లో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లా పాలనావ్యవస్థలో జిల్లా పరిషత్‌ ఉపాంగం కీలకమైంది. ఇంతటి కీలకమైన సర్వసభ్య సమావేశంలో పాల్గొని జిల్లా ఎదుర్కొం టున్న సమస్యలను చర్చించడం తెలిసిందే. వీటి పరిష్కారానికి ఎటు వంటి చర్యలో తీసుకోవాలనే అంశంపై చర్చించడం ఆనవాయితీ. ఇటువంటి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీ మొదలుకుని జిల్లాకు చెందిన ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు హాజరు కావాల్సి ఉంది. ఇందులో జిల్లా ప్రగతికి అవరోధాలుగా మారిన సమస్యలపై చర్చలు చేయాల్సి ఉంది. అనంతరం కలెక్టర్‌తో కూడిన జిల్లా పాలనా యంత్రాంగం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు సంయుక్తంగా సమస్యలను పరిష్క రించాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని కోరుతూ జడ్పీ సిఇఒ అధికార యంత్రాంగం నుంచి వారం రోజులు ముందు ఆహ్వానాలు అందినప్పటికీ పలు వురు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ డైరెక్టర్లు, ఛైర్మన్లు గైర్హాజరు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. గత జిల్లా పరిషత్‌ సమావేశానికి ఇటీవలే కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులైన బద్వేల్‌ ఎమ్మెల్యే, జమ్మలమడుగుకు చెందిన ఎమ్మెల్సీ మినహా మిగిలిన ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం విస్మయాన్ని కలిగించింది. జిల్లా ప్రగతిని కుంటుబరుస్తున్న అంశాలపై చర్చించడానికి రావాల్సిన బాధ్యత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులది. ఇటువంటి బాధ్యతాయుతమైన కర్తవ్యాల్ని నిర్వహించడంపై అంతులేని నిర్లక్ష్యం వహించడం దారుణం. వారం రోజులు ముందుగా ఆహ్వానాలు అందినప్పటికి కీలకమైన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొ రేషన్‌ డైరెక్టర్లు, ఛైర్మన్ల గైర్హాజరు కావడానికి తీరిక లేకపోవడం విస్మ యాన్ని కలిగించింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జిల్లా పరిషత్‌ సమావేశానికి గైర్హాజరైన ప్రజాప్రతినిధులకు ఇంతకుమించిన మహత్కార్యానికి హాజరై ఉంటారనే వ్యంగ్యాస్త్రాలు వినిపించడం గమనార్హం. దీనికితోడు జిల్లాకు చెందిన ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు స్థానం లేకుండా పోవడం అధికార పక్షానికి ఆడిందే పాట పాడిందే పాటగా మారడం అంతులేని నిర్లక్ష్యానికి కారణమని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ప్రజాప్రతి నిధులు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలకు బాధ్య తాయుతంగా హాజరు సమస్యల పరిష్కారంలో పాలుపంచుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
ప్రజాశక్తి - కడప ప్రతినిధి