Jul 11,2023 00:10

సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డిఆర్‌ఒలు

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పనులను నిర్ధిష్ట కాల పరిమితి లోపే పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్‌ లోని ఎస్‌ ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సోమవారం జిల్లా అధికారులు,వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రెవెన్యూ స్థలాల గుర్తింపు అంశాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, అన్ని ప్రభుత్వ విభాగ శాఖల్లో ఎంపిక చేసిన పనులు, వాటికి సంబంధించిన అం శాలను పరిగణలోకి తీసుకొని సత్వరం పూర్తి చేసే విష యంపై సమీక్షలో జిల్లా కలెక్టర్‌ చర్చించారు. జగనన్నకు చెబుదాం (స్పందన) వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ లేకుండా చూడాలని, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎ లోకి వెళ్ళకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని, ఆన్లైన్‌ లో సమస్యలను చూపకుండా చూడా లన్నారు. రీ ఓపెన్‌ అయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల ఎన్‌ రోల్‌ మెంట్‌ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్టూడెంట్‌ ఇన్ఫో లో ఎన్‌ రోల్‌ అయ్యేలా అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. జగనన్న విద్యా కానుక పధకం కిట్లు పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని, లేని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్యామిలీ డాక్టర్స్‌ ప్రోగ్రామ్‌, గృహ నిర్మాణ శాఖ పథకం పనులు, ఉపాధి పనులు,ఎస్సీ,ఎస్టీ సామజిక వర్గాల్లో నిరు పేదలకు ఉపాథి అవకాశాలు మొదలైన అంశాల గురించి సమీక్షించారు.