పల్నాడు జిల్లా: నిర్దేశిత గడువులోగా గృహ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమి టెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ స్థానిక నరస రావుపేట కలెక్టర్ కార్యాలయంలోని బి.ఆర్. అంబేద్కర్ స్పందన హాలులో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల గహ నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దినాలను మరింత పెం పొందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అసిస్టెంట్ ఇంజనీరు తమ పురోగతిని తెలియజేసే విధంగా నివేదికలను సంబంధిత ఎంపీడీవోలకు ప్రతి శని వారం అందించాలన్నారు. లక్ష్య సాధనలో అలసత్వం వహించవద్దని అన్నారు.. ఐ హెచ్ హెచ్ ఎల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి పురోగతిలోకి రావాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. గహ నిర్మాణాల ప్రక్రియలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. కలెక్టర్ ఎల్. శివ శంకర్ మాట్లా డుతూ ఇప్పటివరకు బేస్మెంట్ లెవెల్ నుండి పై వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని బిలో బేస్మెంట్ లెవల్ పనులు 19 శాతం పూర్తయ్యాయని అదేవిధంగా యు డి ఐ, యు ఎల్ ఆర్ పనులు 21 శాతం పూర్తయ్యాయని జాయిం ట్ మేనేజింగ్ డైరెక్టర్ వివరించారు. ఇకపై జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని రోజులు పెంచేలా, ఐహెచ్హెచ్‌ఎల్ పై దృష్టి సారించి పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి బుధవారం నిర్వహించే క్షేత్రస్థాయి పరిశీలనలో హౌసింగ్ శాఖపై దృష్టి సారించి గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులు అవగాహన కల్పించాలన్నారు. లేఅవుట్ల వద్ద సుందర ఆర్చీల నిర్మాణానికి పరిపాలన అనుమతుల కూడా అందజేశామని, మిగిలిన వాటికి రెండు నెలల లోపల పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మ్యాజిక్ సోప్ పిక్స్ ఏర్పాట్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సమీక్షల హౌసింగ్ శాఖ ఈఈ శివలింగం పాల్గొన్నారు.










