
రాయచోటి : జిల్లాలో అధికారులకు కేటాయించిన లక్ష్యాలు వంద శాతం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ గిరీష హెచ్‌ఒడిలకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలలో కలెక్టర్ గిరీష వివిధ శాఖల హెచ్‌ఒడిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ జరిగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌కు అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో నోట్స్ తయారు చేసి విసికి హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లాలోని హెచ్‌ఒడిలు తమకు కేటాయించిన లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. రక్తహీనత లోపం ఉన్న గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దష్టి పెట్టి వారికి సరైన పోషకాహారం అందించి రక్తహీనత నివారణకు కషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. గర్భిణులు, బాలింతలు అనీమియా బారిన పడకుండా ఉండేందుకు, క్రమం తప్పకుండా వారికి పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. చిన్నపిల్లలలో బరువు తక్కువ ఉండడం, ఎదుగుదల లోపం వంటి సమస్యలకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యాశాఖ పరిధిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100 శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు. 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులను ఖచ్చితంగా బడిలో చేరేలా చూడాలని, ఇందుకోసం మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. బడిబయట ఎవరు ఉండకూడదనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఓటర్ జాబితాకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెండింగ్ లేకుండా పక్కాగా పరిశీలన చేసి తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు కషి చేయాలన్నారు. పెండింగ్ అప్లికేషన్లు ఒక్కటి కూడా ఉండడానికి వీలులేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య వివరాలను సేకరించడం జరిగిందని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరంలో వారికి అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు, ఇచ్చే బహత్తర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలందరు ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకునేటట్లు చూడాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి ఇచ్చిన లక్ష్యాలు వంద శాతం పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, ఐసిడిఎస్ పీడీ ధనలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గిరీష