Jun 23,2023 21:44

కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎస్‌పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

బద్వేలు : మహిళలు అన్ని రంగాలలో నిర్భయంగా విధులు నిర్వహించినపుడే మVి ాళా సాధికారత సాధ్య మవుతుందని ఎస్‌పి అన్బురాజన్‌ పేర్కొ న్నారు. శుక్రవారం బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవర ణంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌ (వన్‌ స్టాప్‌ సెంటర్‌)ను ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా, మైదుకూరు డిఎస్‌పి వంశీధర్‌ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పేద, ధనిక అని తేడా లేకుండా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌కు వచ్చి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు. విదేశీ సంస్కతికి మన సంస్కతికి చాలా తేడా ఉందని తెలిపారు. విద్యార్థి దశ నంచే ఆడ పిల్లలకు మహిళా చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సెంటర్లో రెవెన్యూ సిబ్బందితోపాటు, న్యాయవాదులు, డాక్టర్లు కూడా సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. ఫిర్యాదు చేసిన ఏడు రోజులలో పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు. త్వరలో మహిళ ఎస్‌ఐని నియమిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాలలో మహిళలకే అధిక ప్రాధాన్యత నిచ్చారని తెలిపారు. బద్వేల్‌ రెవెన్యూ డివిజన్‌కు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌ను తెచ్చినందుకు ఎస్‌పికి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు తమ ఉద్యోగ, వ్యాపారాలలో ఎవరైనా అసభ్యంగా ప్రవ ర్తించిన ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఎస్‌పి నుంచి ఎస్‌ఐ స్థాయి వరకు అందరి ఫోన్‌ నెంబర్లు నోటీసు బోర్డులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, మెప్మా, మహిళలు పాల్గొన్నారు.