ప్రజాశక్తి-యంత్రాంగం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బంద్ చేపట్టారు. పోలీసుల నిర్బంధాల నడుము బంద్ ప్రశాతంగా సాగింది. కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, మాజీ ఎంఎల్‌సి చిక్కాల రామచద్రరావు పార్టీ శ్రేణులతో కలిసి భానుగుడి జంక్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరి టూ టౌన్ బ్రిడ్జికి చేరుకున్నారు. బ్రిడ్జి రహదారిపై బైఠాయించి నిరసన తెలుపారు. పోలీసులకు తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం మెయిన్ రోడ్డు మీదుగా కొండబాబు జగన్నాధపురం వంతెన వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, వాసిరెడ్డి శివ, ర్యాలి రాంబాబు, తోట కుమార్, సీతారామ్, మడ్డు, విజరు కుమార్, భగవాన్, కళ్యాణ్, వర్మ, గ్రంధి బాబ్జి, గదుల సాయిబాబా తుమ్మల రమేష్, రహీమ్, అంబటి చిన్న, వనమాడి ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల్లో బంద్ పాటించారు. మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట, సర్పవరం, ఎపిఎస్‌పి వరకూ ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించారు. కటకంశెట్టి ప్రభాకర్, నున్న దొరబాబు, బుంగ సింహాద్రి, పిల్లి కృష్ణ, కల్యాణ్ తాతపూడి రామకృష్ణ, కొల్లుబోయిన సూరిబాబు, పడమటి వీరబాబు, చల్మాజీ, ఏడుకొండలు, ఆనందరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు కోరంగి వంతెనపై టిపిపి నాయకులు బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఎస్‌ఐ పి.శ్రీనివాస్ కుమార్ ట్రాఫిక్ క్లియర్ చేశారు. సుంకరపాలెంలో జాతీయ రహదారిపై లారీ, ట్రాక్టర్ టైర్లు వెలిగించి రాస్తారోకో చేశారు. దీంతో అమలాపురం కాకినాడ వైపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో మోపూరి వెంకటేశ్వరరావు, ధూళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగసూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, జక్కల ప్రసాద్ బాబు, మోర్త బైరమూర్తి, వాసంశెట్టి శ్రీనివాస్, రోళ్ల చక్రవర్తి, మల్లాడి వరదరాజు, బోయిడి వేణుగోపాల్ పాల్గొన్నారు. కరప మాజీ ఎంపిపి గుల్లపల్లి శ్రీనివాసరావు. మాజీ జెడ్‌పిటిసి నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన బంద్ నిర్వహించారు. చీపురుపల్లి జయేంద్రబాబు, మద్దూరి స్వామి, యాసలపు విష్ణు, గంజా రాంబాబు, చాట్ర ఇమ్మానుయేలు, పులపకూర శుభ మహేష్, పిల్లి రాముడు, రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, వై.సుకుమార్, అనిశెట్టి గంగాధర్, గుండపు రాజేష్, పోతల గోవింద్, సింగంపల్లి లోవరాజు, దమ్ము నూకరాజు పాల్గొన్నారు. ఏలేశ్వరం పట్టణంలో వాణిజ్య దుకాణాలు, హోటల్స్, బ్యాంకులు, పాఠశాలలు మూతపడ్డాయి. పోలీసుల సహకారంతో అధికారులు ఆర్‌టిసి బస్సులను తిప్పారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, వార్డు కౌన్సిలర్లు భోదిరెడ్డి గోపాలకృష్ణ, ఎండగుండి నాగబాబు, కోణాల వెంకటరమణ, పెండ్ర శ్రీను ఆధ్వర్యంలో బాలాజీ చౌక్ సెంటర్‌లో నిరసన తెలిపారు. జగ్గంపేట రూరల్ కాట్రవులపల్లి, సీతానగరం గ్రామాల్లో ప్రధాన రహదారుల మీద టైర్లను దగ్ధం చేశారు. అనంతరం గ్రామాల్లో తిరిగి బంద్ నిర్వహించారు. సామర్లకోట రూరల్ తహశీల్దారు కార్యాలయం వద్ద తోటకూర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ బంద్ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు అడబాల కుమార స్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి దుకాణాలు, బ్యాంకులు, కార్యాలయాలను మూయించారు. సి కె.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్టీసి బస్సులను ప్రత్యేక బందోబస్తు నడుమ నడిపారు. జనసేన నాయకులు సరోజా వాసు, బిక్కిన రాజశేఖర్, పిట్టా జానకి రామారావు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి టిడిపి, జనసేన నాయకులు దుకాణాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తదితర వాణిజ్య సముదాయాలను మూయించి వేశారు. ఈ కార్యక్రమంలో గుండా అప్పారావు, రావు అక్షరు, రాజు, చోడిపల్లి ప్రసాద్, సనపయ్య, మల్లిబాబు, పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బంద్ పాటించారు. టిడిపి మండల అధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు, ఎలిశెట్టి నాని, కందుల విశ్వేశ్వరరావు, మొయిళ్ల కృష్ణమూర్తి, కంటిబోయిన వెంకటేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు రంది సత్యనారాయణ, తూతిక రాజు, కాకినాడ రామారావు, కొరుపూరి రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వర్మ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూసివేశారు. ఉదయం నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు బందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎఎస్‌పి శ్రీనివాస్ పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీస్ బందోబస్తు నడుమ ఆర్‌టిసి బస్సులు నడిచాయి. రౌతులపూడి టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. మండల కేంద్రమైన రౌతులపూడితో పాటు అన్ని గ్రామాల్లో పాఠశాలలు, దుకాణాలు మూసి వేయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు పైల సాంబశివరావు, సోమరౌతు రవి, పలువురు నాయకులు పాల్గొన్నారు.










