ఘనంగా ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం
నిరాశ్రయులకు అండగా ఉంటాం: కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
నిరాశ్రయులకు అండగా ఉంటూ వారికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అరుణ తెలిపారు. మంగళవారం మెప్మా, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సపోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గహంలో ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అరుణ, అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసెఫ్ రాజ్ ఆధ్వర్యంలో నిరాశ్రయుల వసతి గహంలో ఆశ్రమం పొందుతున్న వారిని ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నిరాశ్రయుల రహిత సమాజ నిర్మాణానికి నగరపాలక సంస్థ మెప్మా సహకారంతో సపోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిరాశ్రయుల వసతి గహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పుట్టుకతోనే ఎవరు నిరాశ్రయులు కాదని, బంధాలు విడిపోవడంతో నిరాశ్రయులు అవుతున్నారని అన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అర్బన్ నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసిందన్నారు. సపోర్ట్‌సంస్థ ఆధ్వర్యంలో నిరాశ్రయుల వసతిగహాన్ని నిర్వహిస్తున్నామని ప్రతిఒక్కరికి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డు, పింఛన్ పత్రాలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసఫ్ రాజు మాట్లాడుతూ వసతి గహాల నిర్వహణకు చిత్తూరు నగర కమిషనర్, మెప్మా అధికారుల సహకారంతో మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్, మెప్మా సీఎంఎం గోపి, వసతి గహ సిబ్బంది ప్రమీల ప్రసన్న, ఇంద్రాణి, రఘుపతి, జయంతి, శ్రీనివాసన్ నిరాశ్రయులు పాల్గొన్నారు.










