పర్యటిస్తున్న బంధం సభ్యులు
ప్రజాశక్తి-అనంతగిరి : మండలంలోని పెదకోటలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుపై సర్వే చేయడానికి జార్ఖండ్ నుంచి బుధవారం వచ్చిన ఇంజనీర్ల బృందాన్ని గిరిజనులు వెనక్కు పంపించారు. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, ఎంపీ మాధవి జోక్యం చేసుకొని గిరిజన గ్రామాలు, భూములు, జలసమాధి కాకుండా చూడాలని హైడ్రో వపర్ ప్రాజెక్టు పోరాట కమిటీ నాయకులు నారంగి సింహాచలం, జన్ని ఈశ్వరరావు డిమాండ్ చేశారు. సర్వేలపై వారిద్దరూ నోరువిప్పి గిరిజన పక్షం వహించాలన్నారు. ఈ కార్యక్రమం లో కురిశాల ఈశ్వరరావు, గొల్లోరి ఆనంద్, కోనేపు పావణి, సివేరి లక్ష్మి,మాదల ఈశ్వరమ్మ పాల్గొన్నారు.










