పుడమిని చీల్చుకుని
పురుడు పోసుకున్న
పైరునడుగు
కష్టమేంటో తెలుస్తుంది.
సీతాకోకచిలుకల్లే
రూపాంతరం చెందిన
గొంగళినడుగు
కష్టమేంటో తెలుస్తుంది
నవమాసాలు మోసి
ప్రసవ వేదనననుభవించి
జన్మనిచ్చిన తల్లి మోములో
ఆనందాన్ని చూడు
కష్టమేమిటో తెలుస్తుంది
నువ్వు ప్రయోజకుడు కావడానికి
కారణమేమిటని
కాయకష్టం చేసి
రక్తాన్ని మరిగించి
స్వేదం చిందించిన
నాన్నని మాత్రం అడక్కు.
నిన్ను నువ్వే ప్రశ్నించుకో
సమాధానం తప్పక దొరుకుతుంది.
యం యస్ రాజు
9502032666