Aug 03,2021 09:58

విజయవాడ : ఎగువ నుండి భారీగా వరద నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజి నిండుకుండలా మారింది. 2 అడుగుల మేర 30 గేట్లను, ఒక అడుగు మేర 40 గేట్లను ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగునీటి అవసరాల కోసం తూర్పు, పశ్చిమ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ బ్యారేజీకి ఇన్‌ ఫ్లో 83139 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 73890గా ఉంది. ఎగువనుండి ఈ బ్యారేజ్‌ కి నాలుగు లక్షల క్యూసెక్కుల వరదనీరు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో... పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కఅష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ హెచ్చరించారు. రెవిన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు.