తెనాలి: అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ప్రశ్నించిన వారిని అంతమొందించే యత్నంలో వైసిపి నేతలున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఈ నెల 9న కొల్లిపర మండలం పిడపర్రు గ్రామ మాజీ సర్పంచ్ వేమూరి మోహన్‌పై వైసిపి నేత ఎ.చంద్రారెడ్డి కొడుకు దాడి చేసిన ఘటనపై బుధవారం ఆయన డిఎస్పీ బి.జనార్ధనరావును కలిశారు. దాడి నేపథ్యాన్ని వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎస్పీని కోరారు. ఈ సందర్బంగా ఆలపాటి మాట్లా డుతూ అనధికారికంగా మట్టి తవ్వకాలకు పాల్పడు తున్న వైసిపి నాయకులను ప్రశ్నించిన టిడిపి నాయ కుడు మోహన్‌పై దాడి చేయడం దారుణమన్నారు. దీనిపై పోలీసులు కూడా నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని అక్రమా లకు పాల్పడుతున్న పార్టీ కేడర్‌ను అదుపు చేయాల్సిన ఎమ్మెల్యే తీరుపైనా మండి పడ్డారు. అధికార పార్టీ బెదిరింపులకు బెదిరిపోయేది లేదని 24 గంటలూ అధికార పార్టీ అక్రమాలను అడ్డుకుంటామని, అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక తరలింపులను అడ్డుకుని తీర తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులు స్పం దించి మోహన్‌పై దాడికి పాల్పడిన వైసిపి నేత చంద్రారెడ్డి కుమారుడు అరుణ్‌రెడ్డి, అతని అను చరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వంగా సాంబిరెడ్డి, నలుకుర్తి రమేష్, నలుకుర్తి విజయ, అత్తోట శరత్‌బాబు తదితరులున్నారు.
16న కృష్ణమాదిగ రాక
కొల్లిపర మండలం పిడపర్రు గ్రామ మాజీ సర్పంచ్ వేమూరి మోహన్‌పై అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు దాడి ఘటన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుల మంద కృష్ణమాదిగ ఈ నెల 16న గ్రామానికి రానున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం తెలిపారు.










