Apr 28,2023 00:28

మాట్లాడుతున్న ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : కోర్టులో నిందితులకు జైలు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధి కారులకు సూచించారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానములో జిల్లా పోలీస్‌ అధికారులతో నేర సమీక్షా సమావేశం గురువారం నిర్వహిం చారు. ఈ సమావేశంలో పీడీ చట్టం అమలు, ప్రాపర్టీ కేసుల గురించి, సర్కిల్‌ వారీగా ఏర్పాటు చేసిన క్రైమ్‌ పార్టీల పనితీరు, రోడ్డు ప్రమాదాలు, కోర్టుల్లో ట్రయిల్‌ జరుగుతున్న కేసుల గురించి, విచారణ దశలో వున్న కేసులు, బాలబాలికల, మహిళల మిస్సింగ్‌ కేసులు, సిసి కెమెరాల ఏర్పాటు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల గురించి సమీక్షించారు.గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టడానికి తగిన పటిష్టమైన చర్యలు తీసుకోవాల న్నారు. గంజాయి విక్ర యాలను సమూలంగా అరికట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి పి.మహేష్‌ , డిసిఆర్‌బి డిఎస్‌పి లక్ష్మయ్య , బాపట్ల ,చీరాల, రేపల్లే డిఎస్‌పిలు ఎ.శ్రీనివాస్‌ రావు, పి.శ్రీకాంత్‌, టి.మురళీకష్ణ, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ పి.మురళీకష్ణ, సిఐలు,ఎస్‌లు పాల్గొన్నారు.