ప్రజాశక్తి - అమరావతి : వినాయక విగ్రహ నిమజ్జనాల్లో అపసృతులకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని డీఎస్సీ బి.ఆదినారాయణ ఆదేశించారు. బుధవారం ఆయన అమరావతి ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వెనుక వైపు వినాయక నిమజ్జనం జరుగుతున్న ప్రదేశాలను సందర్శించారు. పోలీస్ సిబ్బందికి, ఎస్కార్ట్ సిబ్బందికి, పడవ నిర్వహకులతో మాట్లాడారు. నదిలో స్నానాలకు ఎవరు దిగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అపసృతులు వాటిల్లితో వాటికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సిఐ ఎవి బ్రహ్మం, ఎస్సైలు నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, మాబు సుభాని, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అమరావతిలోని మేదర బజారులో న్యాచు రల్ బార్సు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద అన్నదానం చేశారు. ఉప సర్పంచ్ ఎన్.విజయ సాగర్ బాబు, కమిటీ సభ్యులు వెంకీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.










