
తాడేపల్లి: పట్టణంలో చెత్తను తరలించే ఆటోలకు సంబంధిత కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు చెల్లించక పోవడంతో శుక్రవారం ఉదయం నుంచి ఎక్కడికక్కడ ఆటోలను నిలిపివేసి డ్రైవర్లు తమ నిరసన తెలిపారు. వెంటనే తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి ఎక్కడికక్కడ ఆటోలు నిలిచిపోవడంతో చెత్త ఎక్కడికక్కడ దర్శనమిస్తుంది. తమ డిమాండ్లు పరి ష్కరించే వరకు విధులు బహిష్కరిస్తామని డ్రైవర్లు చెబు తున్నారు.