Jul 04,2023 21:25

ఆర్‌డిఒతో మాట్లాడుతున్న టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి

 టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి
ప్రజాశక్తి -పులివెందుల రూరల్‌
రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు అసైన్‌మెంట్‌ భూములు ఇవ్వాలనే ప్రక్రియ జరుగుతోందని, , కానీ పులివెందుల నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకే కేటాయించడం ఎంతవరకు సమంజసమని టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటేశులును ఆయన అసైన్‌మెంట్‌ భూములు సంబంధించి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అసైన్‌ కమిటీ ఆమోదం లేకుండానే జాబితాను ఆమోదించారని, ఇది చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న తప్పులపై ఆయన ఆర్‌డిఒకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని అనర్హులకు అప్పగించే పని జరుగుతుందన్నారు. విఆర్‌ఒ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ వరకు ఎవరు కూడా విచారణ జరపకుండా ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించారని చెప్పారు. ఇచ్చిన వారికే మళ్లీ భూములు ఇవ్వడం దారుణం అన్నారు. పేదలకు కాకుండా వైసిపి నాయకులు కార్యకర్తలకు ప్రభుత్వ భూములను అప్పగిస్తున్నారని వాపోయారు. న్యాయబద్ధంగా విచారించకపోతే ఆర్‌డిఒను కోరామని తెలిపారు. లేనిపక్షంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇందులో అర్హులు దాదాపు ఉంటే 9 మంది తప్ప మిగతా వారంతా అనర్హులే ఉంటారని దీనిపై ఈ ప్రక్రియను పూర్తిగా అధికారులు విచారించాలని పేర్కొన్నారు. సమావేశం జరుపుకుండానే వైసిపి నాయకులు డైరెక్ట్‌గా ఇన్‌ఛార్జి మంత్రి వద్దకు తీసుకువెళ్లి ఆమోదింపజేయడం ఎంతవరకు సమంజసమన్నారు. దీనిపై న్యాయ విచారణ కచ్చితంగా చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో టిడిపి నాయకులు మైసూర్‌ రెడ్డి పాల్గొన్నారు.