నిజాయితీ అధికారికి బాసటగా నిలుద్దాంసిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్
కడప అర్బన్ : ఏడాదిగా తనదైన శైలిలో నగర అభివద్ధికి కషి చేస్తున్న నగరపాలక కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ నిజాయితీగల అధికారికి బాసటగా నిలుద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, జిల్లా కోశాధికారి బి.లక్ష్మీదేవి విజ్ఞప్తి చేశారు. గురువారం పాత బస్టాండ్‌లోని సిఐటియు జిల్లా కార్యా లయంలో విలేకరుల సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ నగరం జలమయం, మురికి మయం, అవినీతిమయం నుంచి విముక్తికి నగరపాలక సంస్థ కమిషనర్ కషి చేస్తున్నారని తెలిపారు. నగరంలో విస్తతంగా పర్యటించి సమస్యలను వెంట నే పరిష్కారానికి చొరవ చూపారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో నగరంలో ఉన్న కొంతమంది నుంచి బకాయిలు వసూలు చేయడంలో ఎంతో కషి చేశారన్నారు. కార్మికులకు, కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు అందించడంలో కమిషనర్ చొరవ అభినందనీయమన్నారు. అనేక సంవత్స రాలుగా ట్రాఫిక్ సమస్యతో సతమవుతున్న ప్రజలకు ఉపశమనంగా నగర రహదా రులు వెడల్పు, వరద కాలు వల నిర్మాణం వంటి అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇలాంటి అధికా రికి కార్మికులు, ప్రజలు మద్దతుగా నిల వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వార న్నారు. సమావేశంలో డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు పాల్గొన్నారు.










