ప్రజాశక్తి -కలెక్టరేట్ : నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక ప్రజాశక్తి అని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ జిల్లా అధికారి ఎంవిఆర్ కృష్ణాజీ అన్నారు. ప్రజాశక్తి దినపత్రిక 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణాజీ మాట్లాడుతూ ప్రజాశక్తి దినపత్రిక ఆవిర్భవించిన రోజు నుండి నేటి వరకు పత్రికా విలువలను పాటిస్తూ బడుగు, బలహీన, కార్మిక, కర్షక వర్గాల సమస్యలను ఎత్తి చూపిస్తూ వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. అదేవిధంగా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలను నిష్పక్షపాతంగా రాస్తూ, ప్రజా సమస్యలను గొంతెత్తి వినిపిస్తూ, సమకాలీన పరిస్థితులను అద్దం పడుతూ ముందుకు సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిఇ రత్నకుమార్, సూపరింటెండెంట్ వివి రమణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ జ్యోత్స్న, జూనియర్ అసిస్టెంట్లు వరప్రసాద్, శ్రీనివాసరావులు, ప్రజాశక్తి డివిజన్ ఆర్గనైజర్ పోలినాయుడు, సిబ్బంది నాగేశ్వరరావు, గౌరీశంకర్ పాల్గొన్నారు.










