Apr 26,2023 23:59

తీర్మాన కాపీని అందజేస్తున ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-హుకుంపేట : జాతీయ రహదారి పనుల్లో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం ఓ బాలుడి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రహదారి నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన నీటి గుంటలో ఈతకు దిగి మజ్జి.జ్ఞాన దిపక్‌(10) విద్యార్థీ మతి చెందాడు. ఈ ఘటన అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండల కేంద్రంలో జరిగింది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మజ్జి, కృష్ణ, సుజాత దంపతుల కుమారుడు మజ్జి జ్ఞాన దీపక్‌ ప్రభుత్వ ఉన్నత ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి మండల కేంద్రలోనే చదువుతున్నాడు. పిల్లలతో కలిసి ఆడుకోడానికి వెళ్లిన జ్ఞాన్‌ దీపక్‌ తిరిగి ఇంటికి రాక పోవడంతో మంగళవారం సాయంత్రం పోలీసు స్టేషన్‌ లో కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యాలయం దగ్గరలో ఉన్న నీటి గుంటలో వెతికారు. ఆచూకి దొరకలేదు. దీంతో బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తుల సహాయంతో నీటి కుంటలో దిగి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో తల్లితండ్రులు ద్ణుఖంలో మునిగిపోయారు.
ఇదిలా ఉండగా జాతీయ రహదారి కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘం, సిపిఎం, ప్రజా సంఘాలు నేతలు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేసే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని ఆందోళన చేశారు. గిరిజన సంఘం నేత తాపుల కృష్ణారావు ఆధ్వర్యంలో అఖిలపక్షం పార్టీ ల నేతలు సంఘట స్థలంలో అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంపై ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని తెలుసుకున్న ఐటీడీఏ పీఓ వీ.అభిషేక్‌ ఘటన స్థలికి చేరుకుని కుటుంబాన్ని పరమర్శించారు. కలెక్టర్‌ తో మాట్లాడి కుటుంబీకులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పోరాటానికి దిగి వచ్చిన హైవే అధికారులు 4 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీ, సీపీఎం నాయకులు సూడిపల్లి కొండలరావు, వైసీపీ యువజన విభాగం నేత నైని సత్తిబాబు, టీడీపీ నాయకులు, హుకుంపేట వార్డ్‌ మెంబర్‌ పాడి వెంకట్‌, కాంగ్రెస్‌ నాయకులు జన్ని అప్పారావు ఉన్నారు.