ప్రజాశక్తి - పెద్దకడబూరు
ప్రభుత్వం ఉపాధి కూలీలకు నీటి వసతి కల్పించాలని వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు తిక్కన్న గౌడ్ కోరారు. శుక్రవారం మండలంలోని చిన్న తుంబలం గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశంలో ఎపిఒ రామన్నతో కలిసి సమావేశం నిర్వహించారు. కూలీల పని తీరు, వారికి రావాల్సిన వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈశ్వరమ్మకు జాబ్ కార్డు ఉందని, పని ప్రదేశంలో ఆమె చేయి విరిగిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి సహాయమూ అందించలేదని తోటి కూలీలు తెలిపారు. దీని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు ఈడిగ తిక్కన్న గౌడ్, ఎపిఒ రామన్న, టెక్నికల్ అసిస్టెంట్ ఇజ్రాయిల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఖాదర్ బాషలు ఈశ్వరమ్మ ఇంటి దగ్గరకెళ్లి ఆమెను పరామర్శించారు. ఆమె మెడికల్ రిపోర్టులను తనిఖీ చేశారు. ఉపాధి కూలీలకు మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నీడ వసతి, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. 200 రోజులు పని దినాలు కల్పించాలని, రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు పనికెళ్లే ప్రదేశానికి రాను, పోను రవాణా చార్జీలు ఇవ్వాలని కోరారు.
సమావేశంలో మాట్లాడుతున్న వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు తిక్కన్న గౌడ్










