నినాదాలు చేస్తున్న దృశ్యం
నీటి సరఫరా చేయండి
ప్రజాశక్తి కావలి రూరల్‌కావలి పట్టణం 36వ వార్డు చెరువు కట్ట గిరిజన కాలనీకి తాగునీటి సరఫరా గత 11 రోజులుగా లేనందున స్థానిక ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో అక్కడే ఈరోజు ఖాళీ డ్రమ్ములతో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఈ కాలనీలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నారని వీరందరూ చాలా నిరుపేదలని వీరికి సక్రమంగా నీటి సరఫరా లేనందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కాలనీకి మున్సిపాలిటీ ట్యాంక్ ద్వారా రెండు లేదా మూడు రోజులకి ఒకసారి వచ్చి నీరు పోసేదని ఇప్పుడు గత 11 రోజులగా మున్సిపాలిటీ ట్యాంకర్లు రావడంలేదని అధికారులు కూడా పట్టించుకోవడంలేదన్నారు. ఈ కాలనీలో చేతి బోరింగులు ఉన్న నాలుగు ఐదు బిందులు కొట్టేసరికి కలుషితమైన నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఈ కాలనీకి వెంటనే నీటి సరఫరా చేయాలని చేతి బోరింగులకు మరమ్మతులు చేయాలని కొత్త బోరింగులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై.కష్ణమోహన్, బి.కృష్ణయ్య, పులా సుబ్రహ్మణ్యం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










