Oct 27,2023 00:07

ప్రజాశక్తి - చెరుకుపల్లి
మండలంలో వరి సాగు చేస్తున్న రైతులు వరి పైరు పొట్ట, చిరు పొట్ట దశలో ఉన్న పొలాలకు లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున 19:19:19 ఎరువును కలిపి పిచికారి చేయాలని ఎఒ టి బాలాజీ గంగాధర్ తెలిపారు. దీనివలన వరిపైరు నీటి ఎద్దడిని తట్టుకుంటుందని తెలిపారు. అయితే వరి పైరు సుంకు దశలో ఉన్నట్లయితే ఎరువును పిచికారి చేయరాదని సూచించారు. ఈ మేరకు గురువారం మండలంలోని ఆరుంబాక, గుల్లపల్లి గ్రామాలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిణి ప్రియాంక పాల్గొన్నారు.