నీటి ఎద్దడి నివారణకు చర్యలు
: ఎమ్మెల్యే శిల్పా
ప్రజాశక్తి - ఆత్మకూర్
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశించారు. శనివారం ఆత్మకూరు మున్సిపాలిటీ సమావేశం చైర్మన్ డాక్టర్ ఆసియా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరు అజెండాలకు సంబంధించిన అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరై మాట్లాడారు. ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరం అనుకుంటే ట్రాక్టర్ల ద్వారా తాగునీటి సరఫరాను చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు పెట్టాలని సూచన చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు రాజగోపాల్, పువ్వాడి దివ్య, కమిషనర్ శ్రీనివాసరావు, కో ఆప్షన్ సభ్యుడు ఎంఏ రషీద్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
ఎంపీపీ తిరుపాలమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మకూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు చర్చించాల న్నారు. గ్రామాల వారీగా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పలు అంశాలపై ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో జడ్పిటిసి సభ్యుడు శివశంకర్ రెడ్డి, ఎంపీడీవో మోహన్ కుమార్, తాసిల్దార్ ప్రకాష్ బాబు, డిఎల్పిఓ కవితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










