Feb 19,2023 23:46
నీటిలో మునిగిన వ్యక్తిని కాపాడి ఒడ్డుకు తెస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: బాపట్ల సూర్యలంక తీరంలో నీట మునిగిపోతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం కాపాడారు. సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కాపాడారు. బీచ్‌ ఇన్‌ఛార్జి హెడ్‌ కానిస్టేబుల్‌ పోతరాజు ఆధ్వర్యంలో సుబ్బారావు, నాగేష్‌ టీం సభ్యులు కాపాడారు. ఈ సందర్భంగా రూరల్‌ సిఐ వేణుగోపాల్‌ రెడ్డి సిబ్బందిని అభినందించారు.