Jul 29,2023 21:35

కుళాయిల ద్వారా బురదతో వస్తున్న తాగునీరు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : పట్టణంలోని 25,26వ వార్డుల్లో సోమవారం కుళాయిల ద్వారా తాగునీరు బురద రంగులో సరఫరా జరిగింది. 30 వార్డుల్లో కుళాయిల ద్వారా బురద నీరు సరఫరా ఇలా జరుగుతుంటే ఆ నీటిని ఎలా తాగ మంటారని మున్సిపల్‌ అధికారులను స్థానికులు ప్రశ్నిస్తు న్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతు న్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటు మున్సిపల్‌ అధికారులు గానీ, అటు ప్రజాప్రతినిధులు గానీ చర్యలు చేపట్టకపోవడం దారుణమని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే తాగునీరు ఈ రంగులో ఉంటే అత్యధిక వర్షాలు పడితే ఇంకా బురదమయంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు శుద్ధ జలాలను సరఫరా చేసి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాలని ప్రజల కోరుతున్నారు.