Oct 24,2021 13:10

అక్షరాలన్నీ ఏరుకుని
పదాలుగా కూర్చుకుని
వాక్యాలుగా అల్లుకుని
సాహితీ మాలలు
తయారుచేస్తుంటాను
స్వేద బిందువులతో
పగలంతా తడిసిన

కార్మికుడిని సత్కరించడానికి
దారపు పోగులను
ప్రోగు చేసి
రంగులన్నీ రంగరించి
అందమైన అంచులతో
నిండైన శాలువాలు
సిద్ధం చేస్తుంటాను

మట్టి రేణువులతో
రోజంతా అలసిన
కర్షకుడిని సన్మానించడానికి
అవి వారికి చేర్చినప్పుడు
నా కలం రాల్చిన
ఆనంద భాష్పాలు
అవే కదా ఈ కవి
హృదయానికి
నిజమైన నీరాజనాలు

కయ్యూరు బాలసుబ్రమణ్యం
94417 91239