Aug 13,2023 00:24

అవగాహన కల్పిస్తున్న సంస్థ సిబ్బంది

ప్రజాశక్తి -కొత్తకోట:ట్లాడుతూ, వరి పంటలో అధిక నష్టాన్ని కల్గించే రసం పీల్చే పురుగు, వాటి గుడ్లను, చిన్న చిన్న గొంగళిపురుగులను నాశనం చేసే నీమాస్త్రం ఉపయోగాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకుని దానిలో 10లీటర్ల గోమూత్రం, రెండు కేజీల ఆవుపేడ ముద్దగా చేసిన 10 కేజీల వేపాకు కలిపి ఉదయం సాయంత్రం సవ్యదిశలో కలిపితే 48 గంటల్లో నీమాస్త్రం తయారవుతుందన్నారు. ఈ కషాయం రసం పీల్చే పురుగు, గుడ్లను, చిన్న చిన్న గొంగళి పురుగులను నాశనం చేస్తుందని వివరించారు. రైతులు తప్పనిసరిగా తయారు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిసిఎస్‌ఎఫ్‌ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.