16 మందికి గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
ప్రజాశక్తి - ఉంగుటూరు (ఏలూరు జిల్లా)
వాటర్ ట్యాంకర్ లారీని ఆర్‌టిసి బస్సు ఢకొీన్న ఘటనలో 16 మంది ఆర్‌టిసి ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని నాచుగుంట వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపాలెం డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో ఏలూరు బయలుదేరింది. నాచుగుంట వద్దకు రాగానే జాతీయ రహదారి మధ్యలోని డివైడర్‌పైన ఉన్న మొక్కలకు నీళ్లుపోస్తున్న వాటర్ ట్యాంకర్ లారీని వెనుకవైపు బస్సు ఢ కొట్టింది. ప్రమాదంలో బస్సులోని 16 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఆర్‌టిసి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










